Sunday, March 23, 2025

కేటీఆర్ దమ్ముంటే కరీంనగర్ నుండి పోటీచేయు…

- Advertisement -

కేటీఆర్ దమ్ముంటే కరీంనగర్ నుండి పోటీచేయు…

సీఎం పదవి,ఎమ్మెల్యే ఒక్కటేనా అని కేటీఆర్ పై ఫైర్…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల,మార్చి 01
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజినామ చేసి మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేయాలని   కేటీఆర్ సవాలు చేయడం హాస్యాస్పదమని
ఎమ్మెల్యే, సీఎం పదవి ఒక్కటేనా అని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కేటీఆర్  పై ఫైర్ అయ్యారు. కేటీఆర్  సవాలు విసరడం పై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కరీంనగర్ పరిధిలోఉంది కధ దమ్ముంటే కరీంనగర్ లేదా, నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీచేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.జగిత్యాల లోని
ఇందిరా భవన్ లో శుక్రవారం జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ఒక్క మెదక్ ఎంపీ సీటుకుడా
గెలిచే అవకాశం ఉండదన్నారు.
రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా  మరో
అదనపు
టీ ఎం సీ కోసం అనుమతులు లేకుండా చేపట్టడం నేరమని అన్నారు.
తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యత ఉందని నివేదిక ఉండగా తుమ్మడి హేట్టి నుండి కిందికి దించటానికి మరో నివేదిక సైతం ఇచ్చారని చెప్పారు.
148 మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని,
ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి కి నీరు చేరేదని కేంద్ర జలవనరుల శాఖ నిపుణులు
వేదిర శ్రీరామ్ నివేదిక ఇచ్చారని చెబుతూ
మెడిగడ్డ పిల్లర్లు కుంగడం టెక్నికల్ లోపమని పేర్కొంటున్నారని తెలిపారు.
ఇకనైనా జ్ఞానోదయం చేసుకోమ్మని కేటీఆర్ కు సూచించారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే పెన్షన్ ,ఇళ్లు రాదని బి ఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేశారని,
ఆచరణకు సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ నాయకులు ఇచ్చారని ప్రచారం చేశారని,కానీ అవి అమలుచేసి చూపిస్తున్నామని, అందులో
ఉచిత బస్సు రవాణా నూరుశాతం విజయవంతం అయిందని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అడ బిడ్డలను గౌరవించడం హిందూ సంప్రదాయమని పేర్కొంటూ
అడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని కేటీఆర్ హితవు
పలికారు.
నేటి నుండి గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలు చేస్తున్నమన్నారు.
ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకున్న వారందరికీ 200 యూనిట్ల మాఫీ వర్తిస్తుందని తెలిపారు.
ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకొని వారు తక్షణమే ధరకాస్తు చేసుకోవాలని జీవన్ రెడ్డి
సూచించారు.
దేశంలోనే 90 శాతం మంది లబ్ది పొందే గొప్ప సంక్షేమ కార్యక్రమ
రేషన్ కార్డు లేని వారందరికి
రెండు నెలల్లో రేషన్ కార్డు జారీ చేస్తామని తెలిపారు.
గ్యాస్ కంపెనీలకు ముందే డిపాజిట్ చేస్తున్నామని చెబుతూ
సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ
రు.500 లకే సిలిండర్ అందుతుందని,
నేటితో మూడు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు.
ఇండ్ల నిర్మాణాలపై వారం రోజుల్లో నిబంధనలు అమలుపై ప్రభుత్వం
ప్రకటన చేస్తోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ
పారదర్షకంగా ఇళ్ల కేటాయింపు  చేస్తామన్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్  వినియోగం కన్నా ప్రజలు ఈ ఏడాది అధికంగా వినియోగించారని తెలిపారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇకనైనా కేటీఆర్ స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు.
అనంతరం  పోచంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ లో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి  పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్, గాజంగి నందయ్య, గాజుల రాజెందర్, మన్సూర్ అలీ, కొత్త మోహన్,గుండా మధు, జున్ను రాజేందర్,బొల్లి శేఖర్,మ్యాన మహేష్, భీరం రాజేష్, గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్