Saturday, September 14, 2024

నిజామాబాద్ పార్లమెంట్‌ ఎన్నికల్లో కత్తిమీద సాములా ఎంపిక….

- Advertisement -

కత్తిమీద సాములా ఎంపిక
నిజామాబాద్, మార్చి 4
పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా పోటీ పడుతున్నా.. నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం రెండు ప్రధాన పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. స్థానికులకే ఛాన్స్‌ ఇవ్వాలని క్యాడర్‌ కోరుతుంటే.. పార్టీ అధిష్టానాలు మాత్రం పక్క జిల్లా నేతల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఆ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కాస్తా.. ఇందూరు వర్సెస్‌ జగిత్యాలగా మారింది. ఇంతకీ ఆ రెండు ప్రధాన పార్టీలేంటి ? ఇక్కడి నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులెవరు తెలుసుకుందాం రండి.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ.. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ నుంచి ఒక్క ఛాన్స్ అంటూ అర డజను మంది క్యూకట్టినా పార్టీ పెద్దలు మాత్రం జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు.నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే.. జీవన్‌రెడ్డికి నిజామాబాద్‌ జిల్లాతో అనుబంధం, అక్కడి నేతలతో సఖ్యత ఉన్నా.. లోకల్‌ క్యాడర్‌ మాత్రం మరో రకంగా ఆలోచిస్తోంది. పక్క జిల్లా అభ్యర్థిని బరిలో ఉంచితే లాభం కంటే నష్టం ఎక్కువ అని భావిస్తున్న వారు.. స్థానికుల్లోనే ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే.. బీఆర్‌ఎస్‌లో సీన్‌ మరోలా మారింది. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా పనిచేసిన కవిత.. ఇప్పుడు పోటీకి నో చెబుతున్నారట. ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండటంతో ఎంపీ బరిలో ఉండేందుకు ఆమె సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించిన గులాబీ పార్టీ… బీసీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలో దింపే ఆలోచన చేసింది. అయితే.. ఆయన కూడా పోటీ విషయంలో ఆలోచనలో పడటంతో జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎల్‌.రమణను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు పక్క జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను బరిలో దించాలని భావిస్తుండటంతో లోకల్‌ క్యాడర్‌లో కాస్త అయోమయం నెలకొంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. నిజామాబాద్‌ జిల్లాలో ఐదు, జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాలున్నాయి.అయితే.. రెండు పార్టీలు స్థానిక నేతలను కాదని జగిత్యాల జిల్లాకు చెందిన నేతలను బరిలో దింపాలని చూస్తున్నాయి. పార్లమెంట్‌ పరిధిలో వీరు లోకల్‌ లీడర్లే అయినా.. జిల్లాలో మాత్రం నాన్‌ లోకల్‌ కావడం పార్టీలకు నష్టం కలిగిస్తుందని కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ అధిష్టానం అనుకున్నట్లుగా ఇద్దరు జగిత్యాల నేతలనే బరిలో దింపితే పాత ప్రత్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశముంది. అటు జీవన్‌రెడ్డి, ఇటు ఎల్‌.రమణ ఇద్దరూ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు పోటీ పడితే.. ఇద్దరూ రెండుసార్ల చొప్పున విజయం సాధించారు. అయితే.. ఇద్దరు నాన్‌ లోకల్‌ లీడర్లు ప్రధానంగా మైనస్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్