Wednesday, February 19, 2025

బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు

- Advertisement -

బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు

Incessant attacks on Hindus in Bangladesh

ఢాకా, నవంబర్ 29, (వాయిస్ టుడే)
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలో హిందువుల పై దాడులు కొనసాగుతున్నాయి. షేక్‌ హసీనాపై నిరసనలో భాగంగా అక్కడి హిందువులపై దుండగులు దాడిచేశారు. షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా దాడులు కొనసాగాయి. ఇక ఇప్పుడు ఇస్కార్‌పై నిసేధం విధించే కుట్ర జరుగుతోంది.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందువులకు రక్షణ కరువైంది. తరచూ దుండగులు మైనారిటీలు అయిన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. తాజాగా బంగాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దీనిపై హిందువులు భారీగా నిరసన తెలిపారు. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్కాన్‌ను నిషేధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇస్కాన్‌ అసాంఘిక చర్యలకు పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన కోర్టు శాంతిభద్రతలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని ఆదేశించింది.నెల క్రితం చిన్మయ్‌ కృష్ణదాస్‌ ఓ ర్యాలీలో బంగ్లాదేశ్‌ జెండాను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో కృష్ణదాస్‌ను ఢాకా విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆ దేశంలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఇస్కార్‌ ప్రతినిధి చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.చిన్మయ్‌ కృష్ణదాస్‌ బంగాలదేశ్‌లోని ఇస్కాన్‌తోపాటు హిందువులకు ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఆదేశంలో ఇస్కాన్‌ సంస్థ గురించి ప్రచారం చేశాడు. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందువుల గురించి హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించేలా ఇస్కాన్‌ కృషి చేస్తోంది. ఇవీ తాత్కాలిక ప్రధాని మహ్మద్‌ యూనిస్‌కు నచ్చడం లేదు. దీంతో ఆయన ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని నిషేధించాలని భావిస్తున్నారు.
ఇస్కాన్‌ అనేది శ్రీకృష్ణుడి గురించి ప్రజలకు అవగాహన కల్పించే సంస్థ. భగవద్గీత సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. స్వామి శ్రీల ప్రభుపాద ఈ ఇస్కాన్‌ సంస్థను 1966 జూలై 11న స్థాపించారు. ఈ ఇస్కాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది హరేకృష్ణ హరేరామ ఆలయంగా సాధారణ ప్రజల్లో గుర్తింపు పొందింది. ఇస్కాన్‌ ఆలయాలో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్తాన్‌లో కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 108 ఆలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని ఢాకా, రాజ్‌షాహి, చిట్టగాంగ్, సిల్మెట్, రంగ్‌పూర్, ఖుల్నా, బరిషల్, మైమెన్‌సింగ్‌లలో ఇస్కాన్‌ ఆలయాలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్