- Advertisement -
కుల గణనలో మున్నూరు కాపులకు అన్యాయం-తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం
Injustice to Munnuru Kapus in caste enumeration-Munnuru Kapu Sangam of Telangana State
హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగనలలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, తెలంగాణ విట్టల్, మంగళారపు లక్ష్మణ్ పటేల్, పద్మావతి లు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇద్దరు రెడ్డి మంత్రులు ఓ బీసీ మంత్రి కలిసి కుట్రపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రీ సర్వే నిర్వహించి తమ సామాజిక వర్గ లెక్కలను పక్కాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించేందుకు ఈనెల 15న అన్ని జిల్లా కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వ స్పందించకుంటే భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని చెప్పారు.
- Advertisement -