- Advertisement -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Inspection of CM's visit arrangements
విశాఖపట్నం
జనవరి 04వ తేదీన విశాఖ ఆర్.కె. బీచ్ వేదికగా జరిగే నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేం దుకు రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చే స్తున్న నేపథ్యంలో సంబంధిత పర్య టన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వ యకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీ లించారు.నగరానికి వచ్చిన ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాలు, ఆర్కే బీచ్ కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, నేవీ కమోడర్ హ్యాపీ మోహన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.ముఖ్యమంత్రి సభా స్థలికి చేరుకునే దగ్గర నుంచి తిరు గుపయనమయ్యే వరకు సంబంధి త షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తూ ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని స్థానిక అధికారులకు సూచిం చారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్ పోర్టు నుంచి ఎన్.సి.బి.కి అక్కడ నుంచి ఆర్.కె. బీచ్ వద్దకు చేరుకుంటారని, అక్కడ జరిగే నావికాదళ విన్యాసాలను వీక్షిస్తా రని, అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారని పేర్కొన్నారు. తర్వాత నేవీ హౌస్ వద్ద జరిగే హై టీలో భాగస్వామ్య మవుతారని దాని ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పా రు.అధికారులంతా సమన్వ యం తో వ్యవహరించాలన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను, జిల్లా అధికార యంత్రాంగం నుంచి చేపట్టే చర్యలను జాయింట్ కలెక్టర్, జీవీ ఎంసీ కమిషనర్, నేవీ కమోడర్ సమన్వయకర్తకు వివరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -