Friday, February 7, 2025

నేరాల నియంత్రణకు సిసి కెమెరాల ఏర్పాటు

- Advertisement -

నేరాల నియంత్రణకు సిసి కెమెరాల ఏర్పాటు

Installation of CC cameras for crime control

–  కమ్యూనిటీ కాంటాక్ట్   కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్

పెద్దపల్లి
నేరాల నియంత్రణకు సిసి కెమెరాల ఏర్పాటు ఆవశ్యకమని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని
ఫారెన్ స్ట్రీట్ లో  పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా  కాలనీలోని పలువురు ఇండ్లలలో తనిఖీలు నిర్వహించారు.  సరైన ధ్రువపత్రాలు లేని 50 బైక్ లు, 6 ఆటోలు, 4 కార్లు  మొత్తం 60 వాహనాలు సిజ్ చేసినట్లు పేర్కొన్నారు. కాలనీ వాసులతో  సీఐ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ  ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ త్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసికోవడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు,  కానిస్టేబుళ్లు,  స్పెషల్ పార్టీ సిబ్బందితో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్