Wednesday, February 19, 2025

పెట్టుబడులు.. కట్టుకధలా…

- Advertisement -

పెట్టుబడులు.. కట్టుకధలా…

Investments.. as commitments...

హైదరాబాద్, జనవరి 30, (వాయిస్ టుడే)
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఇటీవల జరిగింది. ఈ సదస్సుకు భారత్‌ నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులు వెళ్లారు. అయితే ఇరు రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.దావోస్‌లో ఏటా జనవరిలో ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు భారత్‌తోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతిధులు వెళ్తారు. పెట్టుబడులను ఆకర్షిస్తారు. తద్వారా దేశ అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సదస్సుకు ప్రతినిధులు వెళ్తున్నారు. అయితే రెండేళ్లుగా దావోస్‌ సదస్సులో తెచ్చిన పెట్టుబడులపై ఇరు రాస్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలో రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌ వెళ్లొచాయి. ఈ పర్యటన తర్వాత ఇరు రాష్ట్రాలకు వచ్చిన పెట్టబడిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దేశం నుంచి వెళ్లిన రాష్ట్రాల్లో మహారాష్ట్రకు అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఏపీకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి ఎందుకీ దుస్థితి అని నెటిజన్లు నిలదీస్తున్నారు.ఇక దావోస్‌ పెట్టుబడులపై తెలంగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలో తలో విధంగా స్పందించాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాదించిన అతిపెద్ద విజయం ఈ దావోస్‌ పర్యటన అని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ రూ.1.80 లక్షల కోట్ల పెటుట్బడులు సాధించామని వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీగా పెట్టుబడులు రాలేదని తెలిపారు. ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ అనుకూల మీడియా కూడా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేస్తున్నాయి. ఇక ఏపీ విషయంలో మాత్రం మీడియా భిన్నంగా స్పందిస్తోంది. ఈ పత్రిక కథనాలు చూస్తేనే తెలంగాణకు, ఏపీకి పెట్టుబడులు ఎలా వచ్చాయో సులభంగా అర్థమవుతుంది. తెలంగాణ ఎడిషన్‌లో దావోస్‌ ధమాకా అనే శీర్షికతో కథనాలు ప్రచురించాయి. దుమ్మురేపిన తెలంగాణ బృందం అంటూ మరో పత్రిక కథనం ఇచ్చింది. ఇక ఏపీలో ఇవే పత్రికలు మళ్లీ ఏపీ బ్రాండ్, పేరుతో కథనం ఇచ్చింది. దావోస్‌ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ అని మరో కథనం వచ్చింది. ఏపీలో పరిశ్రమల స్థాపనకు అనుకూలతను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ వివరించారని ఇచ్చారు. దీంతో కట్టు కథలు అల్లుతున్నారని జనం మండిపడుతున్నారు.పత్రికల కథనాలు ఎలా ఉన్నా.. ఏపీ మంత్రి లోకేశ్‌ మాత్రం దావోస్‌ పర్యటనపై స్పందించారు. దావోస్‌లో పెట్టుబడులకు ఒప్పందాలు జరగవని, కేవలం చర్చలు మాత్రమే జరుగుతాయని వెల్లడించారు. దీంతో గొప్పలు చెప్పడంలో తండ్రికి మించిన తనయుడిగా లోకేశ్‌ తయారయ్యాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ మాత్రానికి దావోస్‌ వెళ్లడం దేనికి అని కూటమి నేతలు కూడా గుసగుసలాడుతున్నారు. ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సాధించిన పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్