Saturday, September 14, 2024

అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

- Advertisement -

అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

 

నా ఆస్తిపాస్తులపై సీబీఐకి లేఖ రాసేందుకు రెడీ

మీకు దమ్ముందా?

 

కాంగ్రెస్ పార్టీకి ఎక్సైరీ డేట్ వచ్చేసింది

 

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య కొనసాగుతున్న ఎన్నికలివి

ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించి ఓటేయండి

కేసీఆర్ సుద్దపూసైతే సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకున్నట్లు?

 

కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకుగడీల వారసులకు మధ్య జరుగుతున్న యుద్దమిది

నావి ప్రజా పోరాటాలు వారివి అవినీతి సంపాదన కోసం ఆరాటం

ఎటువైపు ఉంటారో ఆలోచించి ప్రజాతీర్పు ఇవ్వండి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

 

‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలారా… నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? మీరు ఓకే అంటే సీబీఐకి లేఖ రాసేందుకు నేను సిద్ధం. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని, ఎవరి పక్షాన నిలిచి ఓటేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో ఎన్నికలు సైతం నరేంద్రమోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. అదే సమయంలో 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై… అంతకుముందు 10 ఏళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ .. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారని విమర్శించారు.

 

 

ఈరోజు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. వీరితోపాటు మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ, ఆరెపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాదం రాజుసహా వందలాది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత ఎర్రం వెంకట్రాజంతోపాటు సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మండలాధ్యక్షులు పాదం శివరాజు ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. వీరిద్దరిని బేరీజు వేసుకోవాలని కోరుతున్నా. అదే సమయంలో 10 ఏళ్ల యూపీఏ పాలనను, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనను బేరీజువేయాలని కోరుతున్నా…కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్…. 10 ఏళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి… 2జీ స్కాం, బొగ్గు స్కాం, విమానాల స్కాం, కామన్ వెల్త్ గేమ్ స్కాం, ఆదర్శ స్కాం.. ఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్ఐ, హవాలా స్కాం,… ఆఖరికి చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుండి వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను)లో వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారులను సంకలో వేసుకుని తిరిగి నీచ చరిత్ర కాంగ్రెస్ దే. దేశం పరువు తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలా నీతులు చెప్పేది. గరీబీ హఠావో అనే నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ నేతలు మాత్రమే అమీర్(సంపన్నులు) లు అయ్యారు. పేదలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. గాంధీ కుటుంబానికే ఈ నినాదం పనికొచ్చిందే తప్ప ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేదు..

కానీ మోదీది అవినీతి మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు. ఈ దేశం కోసం పనిచేస్తున్నరు. కుటుంబాన్ని పక్కనపెట్టి దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తున్నారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. జబ్బు వస్తే టాబ్లెట్లు వేసుకుంటాం. దానిమీద ఎక్సైరీ డేట్ ఉంటది… ఆ గడువు ముగిస్తే.. దానిని చెత్త కుప్పలో వేయాల్సిందే… వందేళ్ల కాంగ్రెస్ బతుకంతా కుంభకోణాలు, లంబకోణాలు, కుటుంబ రాజకీయాలే తప్ప ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.

కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతూ గెలవాలని చూస్తున్నరు. ఇన్ని ప్రలోభాలు పెడుతున్నా లొంగకుండా బీజేపీలో చేరిన నేతలను అభినందిస్తున్నా…దయచేసి కరీంనగర్ లో పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులను బేరీజు వేయండి. నావి ప్రజా పోరాటాలు.. వాళ్లది అవినీతితో ఆస్తులు పోగేసుకునే ఆరాటం ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో ఎవరు ప్రజా సమస్యలపై కుటుంబాన్ని పక్కనపెట్టి  అలుపెరగని పోరాటాలు చేస్తున్నారో. ఎవరు కరీంనగర్ ఓటు విలువను పెంచి దేశవ్యాప్తంగా కరీంనగర్ ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చారో, ఎవరు ప్రజల ఆలోచించండి. తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.

రేపు ఉదయం 8 గంటలకే నరేంద్రమోదీ వేములవాడకు వస్తున్నారు. ఎములాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత 9 గంటలకు ఎములాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎండలున్న నేపథ్యంలో బహిరంగ సభకు వస్తున్న వారి కోసం కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. ఉదయం 8 గంటల వరకే ఎములాడలోని బాలానగర్ కోర్టు వద్ద గ్రౌండ్ జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతున్నా.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్