Saturday, February 8, 2025

సెంచరీ కోట్టిన ఇస్రో….

- Advertisement -

సెంచరీ కోట్టిన ఇస్రో….

ISRO scored a century...

శ్రీహరికోట, జనవరి 29, (వాయిస్ టుడే)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే మొదటి ప్రయోగం కాగా… విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం ఉదయం 6.23 గంటలకు క్రయోజనిక్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. దీని బరువు మొత్తం 2,250 కిలోలు. పదేళ్ల పాటు ఇది సేవలు అందించనుంది. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ.. నావిక్‌ మరింత విస్తృతం కానుంది. ఎన్వీఎస్-01 మాదిరిగానే ఇందులో ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లలో నావిగేషన్‌ పేలోడ్లు ఉన్నాయి. నావిక్‌ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది దేశ భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కచ్చితమైన నావిగేషన్ సమాచారం అందజేయనుంది.శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది జరిగిన దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ మైలురాయిని అందుకుంది. ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచే నిర్వహిస్తోంది. ఈ ప్రయోగం గురించి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. ‘ఇది మునపటి ప్రయోగం లాగే కీలకమైంది.. ఇతర ప్రయోగాల మాదిరిగానే ప్రతి ప్రయోగాన్ని మా సామర్థ్యం మేరకు బలంగా చేస్తాం.. కాబట్టి. అది విజయవంతమవుతుంది’ జీఎస్ఎల్వీ -15 రాకెట్‌ను ఒకప్పుడు ఇస్రో ‘నాటీ బాయ్’ అని పిలిచేవారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాకెట్ 16సార్లు ప్రయోగించగా 6 సార్లు వైఫల్యాలు విఫలమైంది. దీని వైఫల్య రేటు 37 శాతంగా ఉండటటంతో వందో ప్రయోగానికి ఇస్రో ఎంపిక చేయడంపై ఒకింత సందేహాం వ్యక్తమైంది. కానీ, శాస్త్రవేత్తలు నమ్మకం మాత్రం ఈసారి ఒమ్ముకాలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్