దీవాళా తీసింది తెలంగాణ కాదు.. కాంగ్రెస్ పార్టీ
నైతిక బాధ్యత వహించి రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి
తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారు
ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రము
మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు
మాజీ మంత్రి, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్ మే 6
It was not Telangana that celebrated Diwali.. but the Congress party.
తెలంగాణ దివాళా తసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఫైరయ్యారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆయన నాంపల్లిలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. దీవాళా తీసింది తెలంగాణ కాదు.. కాంగ్రెస్ దివాళ తీసిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తాను సిఎం అని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. నెలకు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. దివాళ తీసిందని ఎలా అంటారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని.. ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వదా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా దాపురించిందని విమర్శించారు. రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా యాలని, లేదా నైతిక బాధ్యత వహించి ఉద్యోగుల డిఎ ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని తెలియజేశారు. 2014 లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లు అని తెలిపారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు అని, ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ. లక్షా 30 వేల కోట్లు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి మాట్టాడుతూ.. తెలంగాణ దివాళా తీసిందని.. బయట ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రతినిధులను దొంగలు చూసినట్లు చూస్తున్నారని.. తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదన్నారు. వచ్చే ఆధాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, పించన్లకే సరిపోతుందని తేల్చి చెప్పారు. అయితే, సిఎం మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.


