అంతరాష్ట్ర కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు కరాటే విద్యార్థులు ప్రతిభ

- Advertisement -

 అంతరాష్ట్ర కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు కరాటే విద్యార్థులు ప్రతిభ

మంథని

అంతరాష్ట్ర కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ఆదివారం  హనుమకొండ జిల్లా పరకాల లోని మయూరి గార్డెన్ లో అంతరాష్ట్ర కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శిక్షకులు, కాయ్ రాష్ట్ర స్పోర్ట్స్ కమిషన్ కావేటి   సమ్మయ్య  ఆధ్వర్యంలో మంథని కి చెందిన జపాన్ సిటోరియు కరాటే అకాడమీ విద్యార్థులు కట మరియు కుమితి విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు వెండి కాంస్య పథకాలు సాధించారు  పథకాలు సాధించిన వారిలో ఎండి తైబా, కొండ అశ్విన్ బాబు,  బండారి మణికంఠ,   కే  వర్షిత్, బి అనిశ్వర్,  బి అక్షయ్ కీర్తన్, అట్టెం రాఘవ,  అట్టెం రక్షిత్రాణాలు పథకాలు సాధించారు.
పథకాలు సాధించిన వారిని జపాన్ షిటోరియో కరాటే రాష్ట్ర అధ్యక్షులు, కాయ్ రిఫరీ కమిషన్ చైర్మన్ పి పాపయ్య, కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, గౌరు రాజిరెడ్డి  ఆర్గనైజర్ మాడ సంపత్, ఇన్స్పెక్టర్ మెట్టు హాసిని లు అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular