- Advertisement -
పోర్టులోని చెక్ పోస్టును పరిశీలించిన జాయింట్ కలెక్టర్
Joint Collector inspected the check post at the port
కాకినాడ
కాకినాడ పోర్టు నుంచి పిడిఎస్ బియ్యం అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ 2వ గేట్ వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.. పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అధికారు లతో కలిసి పరిశీలించారు.ఇందులో భాగంగా ఆయన కేఎస్ఫీఎల్ పోర్టు లో ఉన్న ఉషశ్రీ ట్రేడర్స్ కు చెందిన స్టఫ్డ్ రైస్ కంటైనర్ల నుండి చెక్ పోస్ట్ టీమ్ తో నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు.ఈ నమూ నాల పరీక్ష లలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ లేనందున కంటైనర్లు లోని బియ్యం పీడీఎస్ ల బియ్యం కావని నిర్థారించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల భద్రత నిమిత్తం ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రీసైక్లిం గ్ చేసి అక్రమ ఎగమతులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తనిఖీలు పటిష్టంగా నిర్వహించేందుకు ఇటీవల నూతనంగా మరోక చెక్ పోస్టును కేఎఫ్సీఎల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చెక్ పోస్ట్ ల వద్ద సుశిక్షుతులైన సిబ్బంది తనిఖీలు నిర్వహించిన అనంతరం వాహనాలకు గేట్ పాస్ ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు మూడు షిప్ట్ లలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించి నమూనాలు సహకరించడం జరుగుతుందన్నారు. అనుమానిత నమూనాలను విశ్లేషణ నిమిత్తం పౌరసరఫరాల శాఖ జిల్లా ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని జేసీ రాహుల్ మీనా తెలిపారు.
ఈ పరిశీలనలో జేసీ వెంట కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఇన్చార్జి పౌరసరఫరాల అధికారి అధికారిణి ప్రసన్న లక్ష్మీదేవి, పోర్టు అధికారులు, పౌర సరఫరాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -