- Advertisement -

ప్రభుత్వ హాస్పిటల్ లో గర్భిణీ లకు రోగులకు పండ్లు పంపిణీ..
కల్వకుర్తి ప్రింట్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టు డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కేకు కోసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ డాక్టర్ శివరాం తో కలిసి జర్నలిస్టులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి ప్రింట్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అశోక్, అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బాలయ్య, ఉపాధ్యక్షులు రామ్ చందర్ , కార్యదర్శి ఫయాజ్, కోశాధికారి నరేష్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు పరమేష్, హబీబ్, విష్ణు, వెంకటేష్, మధు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -