- Advertisement -
భూ సమస్యల పరిష్కారాని కె రెవెన్యూ సదస్సులు
K Revenue Conferences to resolve land issues
బద్వేలు తాసిల్దార్ ఉదయ భాస్కర్ రాజు
బద్వేలు,
భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని బద్వేలు మండల తహశీల్దార్ ఉదయభాస్కరరాజు తెలిపారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం మండల పరిధిలోని అనంతరాజపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ మాట్లాడుతు ప్రజలు భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగకుండా, ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలన్న సమున్నతాశయంతొ ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతొందన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఒలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -