- Advertisement -
తెల్లపాడు లో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పల్లెనిద్ర
Kadapa District Collector Sridhar Pallenidra in Tellapadu
కార్యక్రమంలో పాల్గొన్న బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆర్డిఓ చంద్రమోహన్, తాసిల్దార్ మధురవాణి
బద్వేలు
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం తెల్లపాడు గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆవరణంలో గ్రామ ప్రజలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో గ్రామంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.గ్రామంలో ప్రధానంగా మౌలిక వసతుల కొరత, లిఫ్ట్ ఇరిగేషన్, భూములు, స్కూల్, స్మశాన ఆక్రమణలు జరిగాయని వాటిని పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని రైతులు అభివృద్ధి చెందాలని అన్నారు. డ్వాక్రా సంఘాల గ్రూపులు ద్వారా దాదాపుగా కోటి నలభై లక్షలు రుణాలు తీసుకొని లబ్ది పొందారున్నారు. గ్రామంలోని యువత, రైతులు సాంకేతికతవైపు అడుగులు వేస్తూ అభివృద్ధి పథంలో నడవాలనేదే పల్లె కోసం ప్రగతి కోసం పల్లెనిద్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గ్రామ ప్రజలకు తెలిపారు. అలాగే గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకున్నానని..ముఖ్యంగా మౌలికవస్తులైన సిసి రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి సమస్యలపై పరిష్కారం చూపుతామన్నారు.అలాగే భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని బద్వేల్ ఆర్డీవోను ఆదేశించారు.కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా ప్రజలనుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు
కార్యక్రమంలో బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేలు ఆర్డిఓ చంద్రమోహన్ కలసపాడు తాసిల్దార్ మధురవాణి ఎంపీడీవో మహబూబ్ ఏ పీ ఓ శివశంకర్ రెడ్డి మండల రెవెన్యూ సిబ్బంది స్థానిక అధికారులు పాల్గొన్నారు
- Advertisement -