కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిఅన్నారు.సూర్యాపేట పట్టణంలోని 4వ వార్డు దుబ్బా తండాలో 100 గిరిజన కుటుంబాలు అయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలుసకల జనుల సంక్షేమానికి గీటు రాయి ల పని చేస్తాయని అన్నారు ప్రతినెలా రూ.2500 రూ.500కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.15000 (రైతులు, కౌలు రైతులకు), రూ.12000 (వ్యవసాయ కూలీలకు వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు,ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, రూ.4000 నెలవారీ ఫించన్ రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా తదితర అంశాలు తెలంగాణ ప్రజా సంక్షేమానికి ఇతోదికంగా దోహదం చేస్తాయని ఆయన అన్నారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ని సూర్యాపేట నుంచి గెలిపించాలాని ఆయన కోరారు.