Tuesday, March 31, 2026

కెసిఆర్  మొదటి సభ విజయవంతం చేయాలి

- Advertisement -

మంత్రి హరీష్ రావు

హుస్నాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకమని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారు. అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష  నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారు.  ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు.  కనీసం టికెట్లు ఇచ్చుకొనే పరిస్థితిలో  లేదు కాంగ్రెస్ పార్టీ.  కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్ లో  జరిగాయి. 8 టిఎంసిలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నం. నీళ్లు వస్తే ప్రతి ఒక్కరు సంతోషం. ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటై. హుష్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం మీ అందరి అదృష్టం. 15వ తేదీ మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొదటి సభ హుస్నాబాద్ లో జరుగుతుంది. కెసిఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని అన్నారు.

2014, 18లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఏవయితే చెప్తారో దానిని పక్క చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసింది  కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న టిఆర్ఎస్ పార్టీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని పెట్టి ఎంతో మంది తెలంగాణ ప్రజల చావుకి కారణం అయింది కాంగ్రెస్ పార్టీ. మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బిజెపి కావాల్నా, మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా అని ప్రశ్నించారు.

హుస్నాబాద్ నియోజకవర్గం ఎందుకు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందింది..  కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభివృద్ధి  చేయలేదు.

ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ ల పంచాయితీ నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్ ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోని కాంగ్రెస్ పార్టీ.  ముఖ్యమంత్రి కేసీఆర్ రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకటి కాదు అనేక పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్రమే మన పథకాలు కాపీ కొట్టింది అంటే మనం ఆదర్షమా కాదా. మూడో సారి కెసిఆర్  విజయం పక్కా.  ముఖ్యమంత్రి కెసిఆర్  మొదటి సభ విజయవంతం చేయాలి. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పండుగ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసి కెసిఆర్ గారిని ఘనంగా స్వాగతం పలకాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఈ సభకు వస్తారు అందరినీ ఆహ్వానించాలి. ప్రణాళికతో జాగర్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సభాస్థలానికి చేరుకునే విధంగా స్థానిక నాయకులు చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్