Tuesday, March 31, 2026

కేసీఆర్ నీ మంచి మెజారిటీతో గెలిపించాలి: హరీశ్

- Advertisement -

గజ్వేల్:  సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గం, మర్కుక్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో సందర్బంగా మాట్లాడారు.  మర్కుక్ దశ, దిశ మార్చింది కేసీఆర్. నీళ్ల కష్టాలు తీర్చాడు.  రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు. నేడు డబుల్ రోడ్లు కనిపిస్తున్నాయి. గతుకుల గజ్వేల్ బతుకుల గజ్వేల్ చేసిండు. నెత్తిమీద గంగమ్మ  లెక్క కొండపోచమ్మ సాగర్ తెచ్చింది కేసీఆరని అన్నారు. మా మండలం కేసీఆర్ అని గొప్పగా చెప్పుకుంటారు.  తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్. కష్టంలో లేడు,  సుఖంలో లేడు ఎక్కడి నుండి వస్తున్నారు. ఎవడో వచ్చి బిడ్డ బిడ్డ అంటే నమ్మితే మాస పోతాం. ఇంకొకడు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు, అభివృద్ధి ఉండదు. నాడు నేను రాను బిడ్డో సర్కారు  దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారు. ఈసారి కారు గేలవగానే సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నాము. అసైన్డ్ ల్యాండ్స్ కి పట్టా ఇచ్చి హక్కులు ఇవ్వబోతున్నం.  సిలిండర్ ధరలు పెంచిన బిజెపి వాళ్ళని ప్రశ్నించాలని అన్నారు.400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము.  రైతు బంధు 16 వేలు ఇవ్వబోతున్నాం.

kcr-should-win-with-your-good-majority-harish
kcr-should-win-with-your-good-majority-harish

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 5 లక్షల జీవిత భీమా, అరోగ్య శ్రీ కింద 15 లక్షల దాకా వైద్యం అందిస్తాం.  సౌభాగ్య లక్ష్మి 3000 ఇవ్వబోతున్నాం. బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకటో, రెండో సీట్లు వస్తాయి. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బుతుల్లోనే బుద్ది చెప్పాలి. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నీ మంచి మెజారిటీతో గెలిపించాలి. కాంగ్రెస్ వస్తె  మూడు గంటల కరెంట్ వస్తది. 10 హెచ్పి  మోటార్ ఎవరు కొనివ్వాలి. రేవంత్ రెడ్డికి వ్యవసాయం అంటే తెల్వదు. 30 తేదీన అందరం కారుకు గుద్దాలి. బీయారెస్ గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్