- Advertisement -
కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR's birthday celebrations
ఓయూలో క్రికెట్ టోర్నమెంట్
హైదరాబాద్
ఓయూలో తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్బంగా నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్ ప్రారంభించారు. అబద్దపు హామీలు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాలా తప్పించుకొని తిరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదిస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు గాధరి కిషోర్. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారన్నారు. ఓయూ అధికారుల వయోపరిమితి 60 నుండి 65 కి పెంచి రాష్ట్ర ప్రభుత్వం నిరోద్యోగుల నోట్లో మట్టికొట్టిందన్నారు. కనీసం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల పాలిట శాపమైందని తెలిపారు గాధరి కిషోర్. ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -