- Advertisement -
నరసరావుపేటలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
Kidnapping gang arrested in Narasa Raopet
పల్నాడు
నరసరావుపేటలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా ను పోలీసులు అరెస్ట్ చేసారు. చెన్నైలో యాచక వృత్తి ముసుగులో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్లు గుర్తించారు. చెన్నై పోలీసులు…నరసరావుపేట ముఠాని అదుపులోకి తీసుకున్నారు. అంజమ్మ,వీరమ్మ, ఉమా,సరస్వతిలు అరెస్ట్ అయ్యారు. ఈనెల 12న సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అసోంకు చెందిన సఖిబుద్దిన్ ను ఈ మహిళలు కిడ్నాప్ చేసారు. సీసీ కెమెరాలలో మహిళ కిడ్నాపర్ లను గుర్తించి అరెస్టు చేసారు. కిడ్నాపర్లది నరసరావుపేట,కొండకావూరు, ఎక్కలవారిపాలెం, యల్లమంద గా గుర్తించారు. నరసరావుపేట లో మహిళ కిడ్నాపర్ల అరెస్ట్ తో ఒక్కసారిగా స్థానికులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు.
- Advertisement -