ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే
గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల్లో రోడ్ షోలో పాల్గొన్న కేకే
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 21: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం రాచర్ల గొల్లపల్లి,బొప్పాపూర్ గ్రామంలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రోడ్ షో కార్యక్రమంలో బొప్పాపూర్ గొల్లపల్లి గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు,యువకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు,కేకే అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు,నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన యావత్ తెలంగాణ ప్రజలకు నిరాశలే మిగిలాయని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు ఎవరికి వచ్చాయంటే కెసిఆర్,కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్లకేవచ్చాయని, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ప్రభుత్వ కొలువలు ఇవ్వక కల్లబొల్లి మాటలు చెబుతూ పూట గడుపుకున్నారని అన్నారు. తెలంగాణ బిడ్డలు ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి కొలువులు చేస్తామని ఎంతో ఆశలతో ఉన్న యువతీ, యువకులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. ఒక్కసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం సిరిసిల్ల నుండి కేటీఆర్ మీద రెండు పర్యాయాలుగా ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నానని ఆయన అన్నారు. సిరిసిల్ల ముద్దుబిడ్డను స్థానిక అభ్యర్థిని నన్ను గెలిపించవలసిందిగా ఓట్లను అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే చేపట్టబోయే ఆరు గ్యారెంటీ పథకాల గురించి చాలా స్పష్టంగా మహిళలకు యువకులకు గ్రామస్తులకు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమిరిశెట్టి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు గాంధీ బాబు , మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, మహిళలు కేకే అభిమానులు రోడ్ షో కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు



