మూడు స్థానాల ప్రకటన మరింత జాప్యం
నల్గోండ: నల్గోండ జిల్లా కాంగ్రెస్ లో పంచాయితీ ఇంకా తేలలేదు. రాష్ట్ర కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్న జిల్లా ఇది. కాంగ్రెస్ దిగ్గజ నాయకులంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలోని సీనియర్లు జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హేమాహేమీలుగా ఉన్నారు. ఈ జిల్లా సీనియర్ నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం బహిరంగమే. . ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయింపు పలు వాదాలకు, వివాదాలకు దారి తీసింది. తెలంగాణలోని 119 స్థానాలకు మూడు జాబితాల్లో 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ కు కీలకమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు చివరి తంతు.. నరాలు తెగే తీవ్ర ఉత్కంఠ రేపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో పలు దఫాలుగా స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించినా కొలిక్కి రాలేదు..