- Advertisement -
హుస్నాబాద్ ప్రజలకు ధన్యావాదాలు
Kudos to the people of Husnabad
హైదరాబాద్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 డిసెంబర్ 2023 న తెలంగాణ లో ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా మెజారిటీ విజయం సాధించాం. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ,కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి నన్ను శాసన సభ్యుడుగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులు,మహిళా సంక్షేమ కార్యక్రమాలు ,విద్యా ,వైద్య ఇతర రంగాల్లో సంస్కరణలు చేశాం.. భవిష్యత్తు లో 4 సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ప్రజలు గత సంవత్సర కాలంగా ఏ విధంగా ఆశీర్వదించారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లలా ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎమ్మెల్యే గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందునని అన్నారు.
- Advertisement -