- Advertisement -
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ పేరు మార్పు
Kukat Pally Metro Station Name Change
రంగారెడ్డి
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు మెట్రో అధికారులు ఓమ్ని హాస్పిటల్స్ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రయాణించే వారికి 399 రూపాయలతో కూడిన ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, సి.బి.పి, ఆర్.బి.ఎస్ డాక్టర్ కన్సల్టెంట్ తో కూడిన హెల్త్ ప్యాకేజీ ను అందిస్తున్నట్లు ఇన్ కార్న్ సంస్థ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇకనుండి కూకట్ పల్లి మెట్రో స్టేషన్ కు సంబంధించి ఓమ్ని హాస్పిటల్స్ కూకట్ పల్లిగా నామకరణం చేస్తున్నట్లు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిబి రెడ్డి తెలిపారు. నేడు కూకట్ పల్లి నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో రైల్ సంస్థలు పనిచేసే ప్రతి ఒక్కరికి తమ ఆసుపత్రి తరఫున మెడికల్ ఎమర్జెన్సీ టైంలో చేయాల్సిన పనుల పైన ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు నుండి మెట్రో సంస్థతో తాము కూడా ఒక భాగంగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్, చీఫ్ స్టాటజీ ఆఫీసర్ మురళి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్ ,ఓమ్ని గ్రూప్ డైరెక్టర్ పూర్ణిమ రెడ్డి, ఓమ్ని హాస్పిటల్ సీఈవో దుర్గేష్ శివ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకిత్ షా, యూనిట్ హెడ్ మెడికల్ సూపర్డెంట్ వారీస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -