Sunday, February 9, 2025

కాళేశ్వరంలో ఘనంగా కుంభాభిషేఖం నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

- Advertisement -

కాళేశ్వరంలో ఘనంగా కుంభాభిషేఖం నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Kumbhabhishekam should be performed grandly in Kaleswaram..District Collector Rahul Sharma

జయశంకర్ భూపాలపల్లి,
ఫిబ్రవరి 5

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరంలో ఈ నెల 7వ తేది 9వ తేదీ వరకు  నిర్వహించనున్న  కుంభాభి షేకం మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు   ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం  ఐడిఓసి కార్యాలయంలో కుంభాభి షేకం మహోత్సవాలు నిర్వహణపై దేవాదాయ, పంచాయతి రాజ్, విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ, సమాచార శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాళేశ్వరం బస్టాండ్ నుండి గోదావరి నది వరకు మరియు బస్టాండ్ వద్ద గల దేవస్థానం ఆర్చి గేటు నుండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ముందుగల ఆర్చ్ గేట్ వరకు మరియు దేవస్థానం బయట ఆవరణ మొత్తం ప్రత్యేక స్వీపర్లను నియమించి ప్రతిరోజు పారి శుద్య కార్యక్రమాలు చేపట్టాకని సూచించారు.  కుంభాభిషేకం జరుగు (3) రోజులు ప్రధాన ఘాట్ మరియు విఐపి ఘాట్ వరకు మొత్తం ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను  నియమించి పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు.  5వ తేదీ నుండి పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభించాలని తెలిపారు. మహదేవపూర్ నుండి కాళేశ్వరం వరకు రహదారిపై  ప్రమాదకరముగా ఉన్న
గుంతలను పూడ్చాలని సూచించారు. 7 నుండి 9 వ తేదీ వరకు 3 రోజులు అత్యవసర వైద్య సేవలు నిమిత్తము అన్ని సదుపాయములతో కూడిన మెడికల్ క్యాంపు  పాత దేవస్థానం కార్య నిర్వహణ అధికారి   కార్యాలయంలో  ముందు ఏర్పాటు
చేయాలని తెలిపారు.   గోదావరి నది వద్ద మరియు దేవస్థాన ప్రాంగణములో భక్తులకు మంచినీటి వసతికి గాను ఆర్.ఓ. వాటర్ డ్రమ్ముల ద్వారా మంచినీటి సౌకర్యాలు కల్పన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ వెనుక భాగంలో గల మరుగు దొడ్లను వినియోగం లోకి తేవాలని ఆదేశించారు.  పోలీస్ శాఖ 3 రోజులు శాంతి భద్రతల నిర్వహణ మరియు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 9వ తేదీ  ఉదయం 10.42 గంటలకు కుంభాభిషేకం చేయుటకు పీఠాధిపతులు, వేద పండితులు, విఐపిలు గోపురాల పైకి మరియు ప్రధాన దేవాలయముల పైకి వెళ్లాల్సి ఉన్నదని  ఆ సమయంలో రద్దీ తో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని సూచించారు.
మత్స్య శాఖ  ద్వారా గోదావరినది వద్ద 10 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు.  ప్రమాదకరమైన స్థలాలను  గుర్తించి ప్రమాద హెచ్చరికల ఎర్ర జెండాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అగ్నిమాపక వాహనము ద్వారా నీటితో ఆలయ 4 గోపురములు శుద్దీకరణ చేయాలన్నారు..
నీటి పారుదల శాఖ  గోదావరి నదిలో డేంజర్ జోన్లను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  తాత్కాలిక నీటి షవర్లను వృద్ధుల, చిన్న పిల్లల సౌకర్యార్థమై ఏర్పాటు చేయాలని తెలిపారు. స్త్రీలు బట్టలు మార్చుకొనుటకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ద్వారా కుంబాభిషేకం జరుగు 3 రోజులు వివిధ ప్రాంతముల నుండి కాళేశ్వరమునకు ప్రత్యేక ఆర్.టి.సి.బస్సుల సౌకర్యము ఏర్పాటు చేయాలన్నారు. కుంబాభిషేకం జరుగు 3 రోజులు కాళేశ్వరము గ్రామమునకు మరియు దేవాలయమునకు 24 గంటలు నిరాఠంకముగా విద్యుత్ సౌకర్యము కల్పించాలని సూచించారు. ప్రత్యాన్మయ సరఫరాకు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.   గోదావరి నదిలో స్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక అధికారులను సిబ్బందిని ఏర్పాటు చేసి తగు చర్యలు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  భక్తులకు ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు ఇసుక లారీలను నియంత్రణ చేయాలని సూచించారు. దేవాలయాన్ని వైద్యుద్దీ కరణ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోస్టర్స్ ,కరపత్రములు, ఆహ్వాన పత్రికలు,  ఫ్లెక్సీలు ద్వారా ప్రచారం  చేయాలని పేర్కొన్నారు.
భక్తులకు అన్నదానం మరియు విధులు నిర్వహించే సిబ్బందికి,  వాలంటీర్లకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని దేవాలయ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసర ప్రాంతములలో టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు అర్చక సిబ్బందిని ఏర్పాటు చేయాలని,
పీఠాధిపతులను ఆహ్వానించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏ ఎస్పి బోనాల కిషన్, డిపిఓ నారాయణ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఏ మల్చూర్ నాయక్, వైద్యాధికారి డా మధు సూధన్, డిపిఆర్ఓ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రహద్ రాథోడ్, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్