450 మంది సువాసినీలతో మూల గాయత్రి మంత్రములతో కుంకుమార్చన
Kumkumarchana with Moola Gayatri Mantras with 450 Suvasinis
శ్రీవాసవీమాతా ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం :
శ్రీమాతా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 450 మంది సువాసినీలతో మూల గాయత్రి మంత్రములతో కుంకుమార్చన నిగ్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనము, యువజన సంఘం ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీమాతా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అమ్మవారికి పట్టు వస్త్రాలను అందించి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామోత్సవం, రధోత్సవం, అష్టోత్తర (108 కలశములు) కలశాభిషేకం, 450 మంది సువాసినీలతో మూల గాయత్రి మంత్రములతో కుంకుమార్చన, లక్ష చామంతి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్న వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి తటవర్తి బదరీ లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు జూలూరి వెంకటేష్, కార్యదర్శి పెరుమాళ్ళ శివ, వబిలిశెట్టి కిషోర్, పులవర్తి విశ్వనాథరావు, బోండా నిషాంత్, మండ చంద్రశేఖర్, సమయమంతుల రవిప్రసాద్, నవీన్, కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.