ప్రకృతి సాగులో దేశానికే నమూనాగా కుప్పం
Kuppam is a model for the country in nature cultivation
రాబోయే ఐదేళ్లలో 100 శాతం ప్రకృతి సేద్యానికి కృషి
త్వరలోనే 100 రూకార్ట్ సబ్జీ కూలర్లు…
పనితీరు పరిశీలించి మరిన్ని తీసుకొస్తాం
ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీ అయ్యే రోజులు వస్తాయి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్-2029ను విడుదల
కుప్పం, జనవరి 7
ప్రకృతి వ్యవసాయంలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే నమూగా మార్చుతానని, రాబోయే ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయంగా మార్చేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ వ్యక్తికి ఏ మందులు అవసరమో ప్రస్తుతం తయారవుతున్నాయని, భవిష్యత్తులో ఏ వ్యక్తికి ఏ ఆహారం అవసరమో అదే పండించే విధానం కుప్పం నుండే ప్రారంభం కావాలని అన్నారు. మన పొలాలే ప్రజలకు శ్రీరామ రక్షగా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జనభా అంతా ఆర్గానిక్ ఆహారమే తినే పరిస్థితి వస్తుందని తెలిపారు. కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్ 2029ను సోమవారం విడుదల చేశారు. అనంతరం శీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి అయ్యారు. రైతులు చేస్తున్న సాగు పద్ధతులను అడిగి తెలుసుకుని వారి అనుభవాలు ఆసక్తిగా విన్నారు అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.