వచ్చే నెల 2 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -

వచ్చే నెల 2 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

Kurumurthy Swamy Brahmotsavam from next month 2

చిన్న చింతకుంట :
శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగిరుల మధ్య కొలువైన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వచ్చే నెల 18వ తేదీ వరకు వైభవంగా కొనసాగుతాయి ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు వారి సౌకర్యార్థం దేవాదాయ ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు వసతులు కల్పిస్తున్నట్లు ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు ఉమ్మడి జిల్లాలోని ఆయా డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు

ఉత్సవాల కార్యక్రమాల వివరాలు..

నవంబర్ రెండవ తేదీ ఉదయం స్వామి వారి కళ్యాణం ఉత్సవం సాయంత్రం 6:15 నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి మయూర వాహన సేవ జరుగు తుంది మూడవ తేదీ సాయంత్రం 6:00 20 నిమిషాలకు స్వామివారికి హంస వాహన నాలుగవ తేదీ సాయంత్రం 6:00 25 నిమిషాలకు శేష వాహన సేవ ఐదవ తేదీసాయంత్రం 6:00 25 నిమిషాలకు స్వామివారికి గజవాహన సేవ ఆరవ తేదీ సాయంత్రం స్వామివారికి బంగారు ఆభరణాలతో అలంకార ఉత్సవం రాత్రి 9 గంటలకు ఆశ వాహన సేవ ఏడవ తేదీ హనుమద్వాసన సేవ నిర్వహిస్తారు 8వ తేదీ ప్రధాన ఘటమైన ఉద్దాల ఉత్సవం చిన్నచింతకుంట మండలం లోని చిన్న వడ్డేమాన్ నుంచి ప్రారంభమై సాయంత్రం జాతర  మైదానానికి చేరుకుంటుంది ఉద్దాలు కొండపైకి చేరుకున్న తర్వాత స్వామివారికి రాత్రి 10:45 నిమిషాలకు గరుడ వాహనంపై ఊరేగిస్తారు స్వామివారికి అలంకరించిన బంగారు ఆభరణాలు నవంబర్ 18 అన్న ఉత్సవాలు ముగిస్తాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular