అసత్య ప్రచారం చేస్తున్న కూటమి నేతలు

- Advertisement -

అసత్య ప్రచారం చేస్తున్న కూటమి నేతలు

Kutami leaders are spreading lies

మాజీ ఎంపీ మార్గాని  భరత్ రామ్
రాజమండ్రి
కూటమి అధికారంలోకి తర్వాత ప్రజలకు ఏం చేసింది …? తిరుపతి లడ్డు గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.  లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని మాజీ ఎంపీ మార్గాని  భరత్ రామ్ ప్రశ్నించారు.  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో అర్థం కావడం లేదు….? లడ్డు నాణ్యత పరీక్షలకు సంబంధించి రిపోర్టులు టిడిపి ఆఫీసుకు ఎందుకు వెళ్లాయి ..? లడ్డు నాణ్యతకు సంబంధించి వివరాలు టీటీడీ బయట పెట్టాలి.  నాణ్యత విషయంలో రిపోర్టులు బయట పెట్టడానికి రెండు నెలల సమయం ఎందుకు పట్టింది.  నేను ఒక హిందువుగా అడుగుతున్నాను.  నాణ్యత పై రెండవ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని అన్నారు.
రాజకీయాల గురించి చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.  తిరుపతిలో వేయికాళ్ల మండపాన్ని తొలగించింది చంద్రబాబు కాదా ..? టిడిపి హయంలో 279 రూపాయలకే కిలో నెయ్యి కొనేవారు.  లడ్డు విషయంలో షిఫ్ట్ నివేదికను మేము నమ్మము.  వారు చంద్రబాబు ఎలా చెబితే అలా నివేదిక తయారు చేస్తారు.  గడచిన నాలుగో నెలలో 42 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు.  టిటిడి పాలక మండలి లో అన్య  మతస్తులు లేరని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular