- Advertisement -
ఏప్రిల్ ఫస్ట్ నుంచి భారీగా పెరగనున్న భూములు
Lands rates will increase massively from April first
హైదరాబాద్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
తెలంగాణలో భూములు కొనాలనుకునేవారికి బిగ్ షాక్ తగలనుంది. మరికొన్ని రోజుల్లో భూముల విలువలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా పలు నివేదికల ఆధారంగా మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన సర్కార్.. పలు సవరణ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్, రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు చాలా తేడా ఉండటంతో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. భూముల విలువను 100 నుంచి 400 శాతం వరకు పెంచేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. ప్రతి సంవత్సరం శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారట. దీతో రాష్ట్రంలో 6ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధంచేయగా.. ఆయా ప్రాంతాలను బట్టి 15-30 శాతం ఫ్లాట్లు, స్థలాల విలువను 4 రెట్లు పెంచే అవకాశం ఉంది. అయితే భూముల వాల్యూ అమాంతం పెరిగితే రియల్‌ఎస్టేట్ రంగం నష్టపోయే అవకాశం కూడా ఉండటంతో శాస్త్రీయంగా పద్ధతిలో మదింపు చేసి, విలువ పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారట. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ నగరాల్లో రూ.3200 ఉంది. అయితే దీనిని 60 శాతానికి మించకుండా రూ.5120 వరకు మాత్రమే పెంచాలని యోచిస్తోంది. హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ గజానికి రూ.26700గా ఉండగా.. కమర్షియల్ స్థలానికి రూ.44900 ఉంది. బుద్వేల్‌లో ఎకరా రూ.20 కోట్లు వరకు పలకగా.. మహేశ్వరంలో గజం రూ.2100 ఉంది. ఇక కమర్షియల్ స్థలం రూ.10,200 ఉంది. నార్సింగ్‌లో రూ.23800, రాయదుర్గంలో రూ.44900, బుద్వేల్‌లో రూ.10200, మణికొండలో రూ.23900గా కేటాయించారు. మహేశ్వరం లాంటి చోట్ల రూ.2100 ఉన్న విలువను 400 శాతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ భూములు, స్థలాలకు ప్రస్తుత విలువను సవరించి 200 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.1000 ఉంటే దాన్ని రూ.3 వేల వరకు పెంచాలనే ప్రతిపాదనలున్నట్లు సమాచారం. 2023-24 రిజిస్ట్రేషన్ శాఖకు 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల రాబడి వస్తుందని భావిస్తున్నారు. ఫ్లాట్ల నుంచి 35.1 శాతం అంటే రూ.5,115 కోట్లు సమకూరుతోంది. ప్లాట్ల నుంచి 22.8 అంటే రూ.3322 కోట్లు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5 అంటే రూ.2838 కోట్లు. వ్యవసాయ భూములు 11.4 శాతం రూ.1668 కోట్లు, నాన్-రిజిస్టర్ 11.3 శాతం రూ.1645 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది.
- Advertisement -