కేంద్ర హోం సహాయ మంత్రి ని కలిసిన జగిత్యాల మున్నూరుకాపు సంఘము నాయకులుజగిత్యాల : జులై 27(వాయిస్ టుడే)
శనివారం రోజున కరీంనగర్ లో కేంద్ర హోం సహాయ మంత్రి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ ని నూతనంగా ఎన్నికైన మున్నూరుకాపు సంఘం జగిత్యాల జిల్లా కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలబూకె అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా సంఘాభివృధి కి తోడ్పడుతానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సాధికారిక సంఘ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ బాదినేని రాజేందర్, జిల్లా మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి మల్లారెడ్డి, కోశాధికారి కుంట సుధాకర్, జిల్లా రైతు నాయకులు మారటి సత్తయ్య, ఉపాధ్యక్షులు బండారి శంకరయ్య, పుప్పాల రాజేష్, చిన్నం తిరుపతి, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు వంగల కవిత -రమేష్ వంగల (జగిత్యాల జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుపోరం అధ్యక్షులు) , సంయుక్త కార్యదర్శులు, జక్కుల లింగా రెడ్డి , దొనకంటి గంగాధర్, నవ్వ లక్ష్మీ -మల్లేశం , పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, నులుగొండ సురేష్, వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటీ అంజయ్య పటేల్, భారతపు లింగా రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి బండారి రాజ్ కుమార్ మరియు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.