- Advertisement -
నేతలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనండి – మంత్రి – పొన్నం ప్రభాకర్
Leaders participate in comprehensive household survey - Minister Ponnam Prabhakar
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలు లేవు .గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాం. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలి. సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండి. ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. సమాచార శాఖలో మీరు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టీ విమర్శించడం కాదు. సమాచార లోపం తో ,అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.. అందరూ సమాచారాన్ని ఇవ్వండి ఈ సర్వే లో పాల్గొనండని అన్నారు.
- Advertisement -



