Tuesday, March 3, 2026

బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం

- Advertisement -

రైతు రుణ మాఫి కాకపోతే దరఖాస్తు ఇవ్వండి
బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం

Let’s put up a statue of Rajiv Gandhi

మంత్రి పొన్నం
హుస్నాబాద్
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు., ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దు. రైతు రుణమాఫీ అందరికీ చేస్తాం.. ఎవరికైనా  రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వండి. 2018 డిసెంబర్ 12 కంటే ముందు 2023 డిసెంబర్ 9 తరువాత లోన్ తీసుకున్న వారివి రుణ మాఫీ కాదు. హుస్నాబాద్ సింగిల్ విండో 4000 మంది సభ్యులు ఉంటే 900 మంది మాత్రమే అప్పు తీసుకున్నారు.. 70 శాతం కి పైగా అక్కడి వారికి మాఫీ అయింది. 2 లక్షల పైన రైతు రుణమాఫీ ఉన్న వారికి కొంతమందికి కాలేదు.. వారి దగ్గర పిర్యాదులు తీసుకొని రుణమాఫీ అవుతుంది. బిఆర్ఎస్ హయంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ విడతల వారిగా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అది తెలంగాణ రైతాంగం మొత్తానికి తెలుసు. మేము ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో లక్ష రూపాయల రుణమాఫీ వరకు 18,260 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. మొదటి దశలో 96 కోట్ల 26 లక్షలు విడుదలయ్యాయి.
రెండవ దశ లో లక్ష 50 వేల వరకు రుణమాఫీ ఉన్న వారికి 9436 మంది రైతులకు 87.36 కోట్లు విడుదల అయ్యాయి.  మూడవ  దశలో 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఉన్న వారికి 7136 మంది రైతులకు 87.06 కోట్లు విడుదల అయ్యాయి. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,882 మంది రైతులకు 269.6 కోట్లు రుణమాఫీ పూర్తి అయింది. నియోజకవర్గంలో 70 శాతం మంది రైతులు లోన్ తీసుకున్నారు. ఇందులో రైతు రుణమాఫీ పూర్తి కానీ వారు 2018 డిసెంబర్ 12 కి ముందు ,2023 డిసెంబర్ 9 తరువాత లోన్ తీసుకున్న వారు ఉన్నారు. 2005 -06 లో దేశం మొత్తం ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ మా ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ది. బీఆరెకస్  10 ఏళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ ఎన్ని విడతల్లో చేశారు ..ఎంత మంది కి ఇచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనేది రైతులందరికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. రైతులు బీజేపీ , బి ఆర్ఎస్ చట్రంలో పడద్దు. మాటమీద నిలబడే ప్రభుత్వం మాది  ఒకేసారి రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం. ప్రతిపక్షాలు లోన్లు మాఫీ కాలేదని అబద్ధాలు ఆడుతున్నారు. కేటీఆర్ నిన్న సిరిసిల్ల మాట్లాడుతూ పాప4న్న విగ్రహం పెట్టాలి అంటున్నారు.. యేస్ మేము పాపన్న విగ్రహం పెడతాం . 10 ఏళ్లు మీరు అధికారంలో ఉండి పాపప్న విగ్రహం ఎందుకు పెట్టలేదు . 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కే గ్యాస్ అందిస్తున్నాం..ఎవరికైనా రాకపోతే  మండల కార్యాలయాల్లో కరెక్షన్ చేసుకోవాలి. త్వరలోనే రేషన్ కార్డులు,ఆరోగ్య శ్రీ కార్డులు ,ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఆర్టీసి చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న ఒకరోజే 64 లక్షల మంది ప్రయాణం చేశారు..
టికెట్ ద్వారా 15 కోట్ల ఆదాయం వచ్చింది.. ఆర్టీసి సిబ్బందికి ధన్యవాదాలు ,అభినందనలు..ఆర్టీసి నష్టాల నుండి క్రమంగా గట్టెక్కుతున్నం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంటే మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు.. ఓ వైపు ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారు. గతంలో కేపి కాలనిలో దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీటర్లు లా. మా ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీజేపీ ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేసిందో చెప్పాలని అన్నారు.
కెసిఆర్ ట్యూనింగ్ ,కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నీ విమర్శిస్తే  మీకు మీరే అవమానపర్చుకున్నట్లె. ఇద్దరు కలిసి వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 8 దాటలేదు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో మా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తీరుతాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా. సెక్రటేరియట్ ముందు ఎవరి విగ్రహం తొలగించలేదు .ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.. కేటీఆర్ ఆయన విగ్రహం పెట్టుకోవాలనుకున్నారో ఏమో. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. త్వరలోనే అట్టహాసంగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం. సోనియా గాంధీ రాలేకపోవడం వల్లే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభం కాలేదు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ పనులు పరిశిలించా. బరా బర్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్