Friday, February 13, 2026

క్రాప్ లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింప చేయాలి

- Advertisement -

క్రాప్ లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింప చేయాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జిల్లా స్థాయి బ్యాంకింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అగ్రికల్చర్ సమావేశం
జగిత్యాల,:

Loan waiver should be applicable to crop loan borrowers

ఇటీవలే ప్రభుత్వం క్రాప్ లోన్ రుణమాఫీకి  సంబంధించి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింప చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆన్నారు..గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంకింగ్  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం క్రాప్ లోన్ రుణమాఫీకి సంబంధించి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింప చేయాలని, ప్రతి కుటుంబానికి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం జి.ఓ  జారీ చేసిందని, విధి విధానాలు తప్పక పాటించాలని నిర్లక్ష్యం వహించరాదని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 367 జి.ఓ క్రాప్ లోన్ కట్ఆఫ్ డేట్  లోపు ఉన్న ప్రతి రైతులకు రుణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని కోరారు.రైతులలో ప్రధానంగా కొందరు           ఈ-కేవైసీ కానీ వారు ఉన్నారని, వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ- కేవైసీ చేయించాలని కోరారు.అలాగే                మహిళా శక్తి క్యాంటీన్లు కూడా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో 300 మంది లబ్ధిదారులు రుణాలు రిజెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని  క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. అలాగే రైతు మిత్ర, కౌలు రైతు అర్హులు కాదాని అధికారులు తెలిపారు.ఈ  కార్యక్రమములో జడ్పీ డిప్యూటీ సీఈఓ రఘువరన్, ఎల్డీ.ఎం. రాం కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాణి,  డిఆర్డీవో సంపత్ రావు, బ్యాంక్ అధికారులు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్