34.8 C
New York
Saturday, June 22, 2024

ప్రచార సభను విజయ వంతం చేయండి : ఉత్తమ్

- Advertisement -

*18న కోదాడలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను విజయ వంతం చేయండి*
*కాంగ్రెస్ శ్రేణులకు

Make the campaign a success : Uttam

*
కోదాడ /నడిగూడెం: ఏప్రిల్ 16(వాయిస్ టుడే). సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న, కొల్లు కోటయ్య ఫంక్షన్ హాల్ లో మునగాల, నడిగూడెం, మోతె మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి & కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
* ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధి రఘు వీర్ రెడ్డి రాష్ట్రం లోనే భారీ మెజార్టీ తో గెలవ బోతున్నారన్నారు.
* నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
భారత దేశంలోనే మీలాంటి వీర సైనికులు లక్షలాది మంది ఉన్న గొప్ప కాంగ్రెస్ నియోజక వర్గం అన్నారు.
కాంగ్రెస్ సభ్యత్వం చేసినపుడు భారత దేశంలోనే ఎక్కువ సభ్యత్వం నాలుగున్నర లక్షలు చేసింది నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గం అన్నారు.
నాగురించి , పద్మావతి గ గురించి మీకు తెలుసు. రాజకీయం అంటే పైసలు సంపాదించడానికో, లేక పోతే అధికారం చెలాయించడానికో అని మేము ఏనాడు భావించలేదన్నారు.
నడిగూడెం మండలంలో 1994 నుండి మీరందరూ కూడా కుటుంబ సభ్యులులాగా మాతో వ్యవహరించారన్నారు.
30 ఏళ్లపాటు అంటే సగం జీవితం కంటే ఎక్కువనే మీ అందరితో కష్ట సుఖాల్లో పాలు పంచు కుంటూ ముందుకు పోయినమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీలో కష్ట పడిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
గత ఐదేళ్లలో బిజెపి ప్రభుత్వం ఏమి చేయక పోగా మనకు చట్టపరంగా రావాల్సిన వాటిని కూడా విస్మరించారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత , బి ఆర్ ఎస్ పార్టీ మనుగడ కష్టమే అన్నారు.
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తే సహించేది లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవనీ ఉత్తంకుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ,మండల ,గ్రామస్థాయి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!