మెదక్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు
మెదక్: ఆగస్టు 23: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జిల్లా కేంద్రమైన మెదక్ లో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీసు సూపర్డెంట్ కార్యాలయం నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటుతో పాటు వివిధ భవనాలను ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సిఎం సమావేశం నిర్వహించారు . అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చూసే తలసరి ఆదాయం, తలసరీ విద్యుత్ వినియోగం లో తెలంగాణ నెం.1 నిలిచిందని దేశంలొ స్వచ్చమైన త్రాగునీరు ప్రతి ఇంటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
గతంలో 23 లక్షలు మాత్రమే పెన్షన్ లు ఉండే. ప్రస్తుతం 54 లక్షల పెన్షన్ దారులు ఉన్నారని రానున్న రోజుల్లో మరింత పెంచుతామని గణపురం ఆయకట్టు ఎలా బాగు చేసుకున్నామో మన అందరికీ తెలుసునని సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ లు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
మంజీర లో అనేక చెక్ డ్యాం లు కట్టుకున్నామని రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. మెదక్ శాసన సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి రామయంపేట ను రెవిన్యూ డివిజన్ మార్చాలని కోరారని రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ శాసనసభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డిజిపి అంజనీ కుమార్ మల్టీ జోన్ 2 ఐజి చెంద్రశేకర్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ జిల్లాలోని వివిధ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు జడ్పిటిసిలు జడ్పిటిసి సభ్యులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.