Saturday, February 15, 2025

మణుగూరు మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ల  లేక అల్లాడుతున్న ప్రజలు…

- Advertisement -

మణుగూరు మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ల  లేక అల్లాడుతున్న ప్రజలు…

Manuguru Municipality Annaram Village Mission Bhagiratha Neella  or Waving People

ఓట్ల కోసమే నాయకులు వస్తున్నారు తప్ప, మా నీళ్ల గోస తీర్చట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు…

ఈసారి మున్సిపాలిటీ ఓట్లకు పార్టీల నాయకులు మా ఊరు వస్తే తగిన బుద్ధి చెబుతామని అంటున్న గ్రామ ప్రజలు…

భద్రాద్రి కొత్తగూడెం

గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు అద్భుతంగా మంచినీళ్లు ఇస్తున్నాయని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నా అందుకు విరుద్ధంగా మణుగూరు మండలంలోని అన్నారం గ్రామంలో చుక్కనీరు లేక గ్రామ ప్రజలు అల్లాడుతున్నారు. పక్కా మంచినీటి కనెక్షన్స్ ఇండ్లలోకి ఇవ్వకపోవడంతో నీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు.బుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నామని మిషన్ భగీరథ పైప్ లైన్ ఇండ్లలోకి ఇవ్వలేదని డ్రైనేజీ లోనే మంచినీళ్ల పైపును వదిలేశారని డ్రైనేజీ నీళ్లు మంచినీళ్లు కలిసి ఆ నీళ్లు తాగడం వల్ల విష జ్వరాల బారిన పడుతున్నామని ఈ మధ్యనే విష జ్వరాలతో మంచం పట్టి మరణించిన దాఖలాలు ఉన్నప్పటికీ స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ గాని పార్టీ నాయకులు గానీ ఇటువైపు అన్నారం గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనునిత్యం నీళ్ల కోసం ఒక యుద్ధం చేయాల్సి వస్తుందని   డ్రైనేజీలోకి దిగి చుక్క చుక్క నీరు మగ్గుల్లో పట్టుకుని సేకరించుకోవాల్సి వస్తుందని ఉన్న సమయం అంతా నీళ్లు సేకరించడానికి సరిపోతుందని,
పురుగు బూసి రాత్రి వేళలో కరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అన్నారం గ్రామ ప్రజలం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు మండలం వాసులం కాదా మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేసారని మున్సిపాలిటీ కమిషనర్ను నిలదీస్తున్నారు. వచ్చేది ఎండాకాలం కావడంతో నీళ్లతో అల్లాడుతున్నామని పిల్లాపాపలతో బుక్కెడు నీళ్ల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించిందని రోదిస్తున్నారు. ఈ సారి స్థానిక  మున్సిపాలిటీ ఎన్నికల్లో మా అన్నారం గ్రామానికి ఓట్లు అడగడానికి వచ్చిన పార్టీ నాయకులను నిలదీస్తామని ఎవరైతే మా గ్రామానికి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు అందిస్తారు, ఆ పార్టీకి ఓట్లు వేస్తామని తెగేసి చెప్తున్నారు. ఈసారి మా గ్రామానికి వచ్చిన పార్టీలకు స్పష్టమైన హామీ మంచినీళ్లు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తామన్న పార్టీకే ఓట్లు వేస్తామని అలా కాని పక్షంలో రాజకీయ పార్టీలను మా అన్నారం గ్రామంలో బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్ల ద్వారా ఇంటింటికి మంచి నీళ్ల కనెక్షన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నప్పటికీ మా అన్నారం గ్రామాన్ని వెలివేశారని ఒక్క చిక్కనీరు రాక అల్లాడుతున్నామని పార్టీ నాయకులు గానీ అధికారులు గానీ మా గ్రామవైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మా గ్రామంలో ఎన్నికలను బాయ్ కట్ చేస్తామని ఎవరైనా నాయకుడు మా ఊర్లో ఓట్లు అడగాలంటే ముందు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పక్కాగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని స్పష్టం చేశారు.. అలా ఇంటింటికి పక్కా మంచినీళ్ల కనెక్షన్ ఇస్తామని హామీ పత్రం రాసి ఇవ్వాలని ఆయా పార్టీలను హెచ్చరించారు. ఎన్నోసార్లు స్థానిక మున్సిపల్ మణుగూరు కమిషనర్ కి దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకున్న దాఖలా లేవని ఋక్కెడ నీళ్ల కోసం పిల్లాపాపలతో అల్లాడుతున్నామని రానున్న ఎండాకాలంలో మరింత నీళ్ల సమస్య ఎక్కువ కానుందని ఇకనైనా స్థానిక మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే స్థానిక నాయకులు పట్టించుకుని మా ఊరికి ఇంటింటికి నల్ల కనెక్షన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఓట్లు ఉన్నప్పుడే అన్నారం గ్రామ ప్రజలు నాయకులకు గుర్తు వస్తారని ఓట్లు అయిపోయిన తర్వాత మా వైపు తిరిగి చూసే నాధుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా అన్నారం గ్రామంలో నీళ్లగోస తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇకనైనా స్థానిక మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ చర్యలు తీసుకొని మా అన్నారం గ్రామ ప్రజలకు ఇంటింటికి పక్క నల్ల కనెక్షన్ ద్వారా మంచినీళ్లు అందించాలని లేనిపక్షంలో స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ పై మూకుమ్మడిగా అన్నారం గ్రామ ప్రజలం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్