సాగు, తాగు నీరు కోసం చర్యలు
మంత్రి పొన్నం
హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండలం కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులతో ముచ్చటించారు. మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉదయం పూటనె ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ పేరుతొ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు..తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న. మీ సమస్యలు ఎం ఉన్నా మీ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లండి. వర్షాకాలంలో సరైన విధంగా వర్షాలు పడని కారణంగా కరువు ఏర్పడింది. రైతాంగానికి కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. తాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులేకుండా గ్రామాల్లో పాత బావులు కిరాయికి తీసుకోవడం , నూతన బోర్లు వేయడం ఏ అంశాలున్నా యుద్ధ ప్రాతిపదికన చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఉండే సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు రాబోయే కాలంలో పరిష్కరించబడతాయి. మహిళలు ఆర్టీసీ బసుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 500 కే గ్యాస్ తో పాటు ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రేషన్ కార్డులు కూడా త్వరలో ఇవ్వబొతున్నామనిఅన్నారు.
వేసవి కాలం దృష్ట్యా తాగు సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఉదయాన్నే రైతులను ,ప్రజలను కలిసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో మా ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజా సమస్యలు తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం మంచి పరిపాలన తో మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. ..
సాగు, తాగు నీరు కోసం చర్యలు
- Advertisement -
- Advertisement -