- Advertisement -
రైసు మిల్లుల కాలుష్యంపై కలెక్టరేట్ లో భేటీ
Meeting in Collectorate on pollution of rice millsనెల్లూరు
రైసుమిల్లుల కాలుష్యం, దగదర్తి ఎయిర్ పోర్టులపై నెల్లూరు కలెక్టరేట్ లో కీలక సమావేశంజరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు ఇఫ్కో కిసాన్ సెజ్, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు హజరయ్యారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని రైసుమిల్లుల కారణంగా వెదజల్లుతున్న కాలుష్య తీవ్రతను ఆధారాలతో సహా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రస్తావించారు. రైసుమిల్లులను నెల్లూరు నగర పరిధిలో నుంచి మరో ప్రాంతానికి తరలించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, రైసుమిల్లులను తరలించే చర్యల్లో భాగంగా మిల్లర్ల అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. స్వచ్ఛభారత్ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే అల్లీపురం డంపింగ్ యార్డును ఖాళీ చేయిస్తామని మంత్రి నారాయణ హమీ ఇచ్చారు
- Advertisement -




