- Advertisement -
నర్సాపూర్ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
Minister Damodara Rajanarsimha inaugurated Dialysis Center at Narsapur Hospitalసంగారెడ్డి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా పర్యటనలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలతో నూతనంగా 5 బెడ్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక డయాలసిస్ కేంద్రాన్ని ఎంపి రఘునందన రావు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఎన్ సి డి సెంటర్ (నాన్ కమ్యూనికేబుల్ డీసెస్) ను , అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని, ట్రామా సెంటర్ లను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, డాక్టర్లను, సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల బలోపేతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, డి ఎన్ హెచ్ ఓ Dr శ్రీరామ్, డిప్యూటీ డిఎంహెచ్వో Dr. సుజన, ఆస్పత్రి సూపరిoటెoడెంట్ Dr పావని, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -




