Sunday, September 8, 2024

తెలంగాణలో మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశాను గంగుల కమలాకర్

- Advertisement -

తెలంగాణలో మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశాను
—మున్నూరు కాపు బిడ్డగా పుట్టడం గర్వంగా భావిస్తున్నాను
—నాకు అండగా నిలిచిన మున్నూరు కాపు కులబాంధవులకు కృతజ్ఞతలు
—మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా, నవంబర్ 07 (వాయిస్ టుడే): కరీంనగర్ నగరంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్ లో జిల్లా మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. తెలంగాణలో మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశాను. మున్నూరు కాపు బిడ్డగా పుట్టడం గర్వంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టడంలో కులబాంధవులు ప్రముఖ పాత్ర పోషించారు అని అన్నారు. నాకు అండగా నిలిచిన మున్నూరు కాపు కులబాంధవులకు కృతజ్ఞతలు. నా రక్తాన్ని ధారబోసైనా కుల అభివృద్ధికి కృషి చేస్తాను. 7 దశాబ్దాల స్వతంత్ర పాలనలో కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచినవారు… 2వ సారి గెలిచిన చరిత్ర లేదు. వెనుకబడిన కులాల బిడ్డకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ప్రపంచానికి అన్నం పెట్టే కులం మున్నూరు కాపు… కులబాంధవుల అండతో 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాను. నా కుల బాంధవులే నా బలం… నా నమ్మకం..‌. నేను ఎదిగింది మీరిచ్చిన భరోసాతోనే మీ బలంతోనే మూడుసార్లు గెలిచాను. నాకు మంత్రి పదవినిచ్చి సీఎం కేసీఆర్ మున్నూరు కాపుల గౌరవాన్ని కాపాడారు. కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపు కులాన్ని బలోపేతం చేసిన ఘనత నాది. కబ్జాకు గురైన మున్నూరు కాపు సంఘం స్థలాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేశాం.
ఒకప్పుడు మున్నూరు కాపులకు టికెట్ ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు వెనుకడుగు వేశాయి… కానీ ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మున్నూరు కాపులకి టికెట్ ఇచ్చింది. అన్ని పార్టీలు మున్నూరు కాపులకు టికెట్ ఇవ్వడంలో కుట్రకోణం దాగి ఉంది. మున్నూరు కాపులను చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన కుల సంఘానికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ సహకారంతో వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అన్ని అభివృద్ధి చేశాను.
బిసి బిడ్డకు అధికారమిస్తే అభివృద్ధి చేస్తాడని నిరూపించాను.
రాజకీయ జీవితంలో ఇప్పటివరకు నా కుటుంబానికే కాదు… కులానికి మచ్చ రాకుండా భయంతో భక్తితో పని చేశాను.
నాలుగవసారి గెలిస్తే అసెంబ్లీలో గంగుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. గంగుల పేరు చిరస్థాయిగా నిలవకుండా విత్తనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఒక గంగులనే కాదు మున్నూరు కాపు కులాన్ని గొడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నా కులం కోసం నా జీవితకాలం పనిచేస్తాను. మరోసారి గంగుల అక్కడికి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ బిజెపిలో అధికారంలోకి వచ్చింది లేదు పోయింది లేదు ఆ పార్టీలకు మీ విలువైన ఓటు వేసి వృధా చేయొద్దు. మరోసారి నన్ను గెలిపిస్తే మంత్రినై కరీంనగర్ అన్ని మరింత అభివృద్ధి చేస్తాను. మీరు ఇచ్చే బలం నాకు కొండంత అండ… కరీంనగర్ లో ఉన్న విజయాన్ని ఎవరు ఆపలేరు. నన్ను గెలిపించేందుకు కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. తెలంగాణలో మున్నూరు కాపు కుల సంఘం బలోపేతమైంది. ఇప్పుడు ప్రతి పార్టీ మున్నూరు కాపుల వైపే చూస్తుంది. స్వయంపాలనలో మున్నూరు కాపులకు పెద్దపీట వేసిన ఘనత బిఆర్ఎస్ సీఎం కేసీఆర్ ది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షులు తోట సత్యనారాయణ, జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, నగర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కర్ర రాజశేఖర్, మున్నూరుకాపు కుల బంధువులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్