- Advertisement -
భూత్పూర్ ముంపు గ్రామంలో మంత్రి జూపల్లి పర్యటన
Minister Jupalli's visit to Bhootpur Mumpu village
మక్తల్
మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మక్తల్ మండలం భూత్పూర్ ముంపు గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటిని పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు మొసళ్లు, పాముల మధ్య బతుకీడుస్తున్నామని మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నీటి ఊటతో చేమ వచ్చిన ఇండ్లలో ఉండలేకపోతున్నామని తమ దీన స్థితిని వివరించారు. గ్రామస్తుల ఆవేదనను చూసి మంత్రి చలించిపోయారు. గ్రామంలో హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మీ ఓర్పుకు, సహనానికి దండం పెట్టాలి అని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఇందిరమ్మ పాలనలో అందరికీ న్యాయం చేస్తాం. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్తాం. త్వరలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరిస్తాం. ముంపు భాదితులకు ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పునరావసం కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని అదనపు కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి . పునరావాస, పునర్నిర్మాణం (ఆర్ అండ్ ఆర్) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.
- Advertisement -