హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
కరీంనగర్
Minister Ponnam Prabhakar’s visit to Husnabad Constituency
హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరమర్శించారు. చిగురు మామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులతో ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష ,లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని.. గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని తెలిపారు. వరి నాట్లు ఎలా జరుగుతున్నాయని , వ్యవసాయ పనులు జరుగుతున్న తీరు పై ఆరా తీశారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.. సమస్య పరిష్కారం పై అధికారులను ఆదేశించారు.



