Monday, December 23, 2024

పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు వివరాలు వెల్లడించిన మంత్రి  

- Advertisement -

మహిళలు చిన్నారుల భద్రత కోసం రూ.13,412 కోట్లు ఖర్చు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి
ఢిల్లీ,

Minister Sanjay disclosed the details of the question asked in the Parliament.

పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు వివరాలు వెల్లడించిన మంత్రి  సంజయ్.
దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ  నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆ వివరాలను సభలో వివరించారు. అవేమిటంటే.
ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణ కోసం రూ.950 కోట్లు,  రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలు, ఫోరెన్సిక్  డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల ఆధునీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2840 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
అట్లాగే శిక్షణ, సామర్ధ్యం పెంపు కోసం రూ.76.5 కోట్లు, పేద ఖైదీల కోసం రూ.60 కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, యూనిట్ కోసం రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్ డెస్కుల కోసం రూ.164.2 కోట్లు, చండీఘడ్ లో డీఎన్ఏ ల్యాబ్ ఏర్పాటు కోసం రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణ కోసం రూ.224.76 కోట్లు, సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రూ.200 కోట్లు, దిల్లీ పోలీస్ స్కీం ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ , కౌన్సిలర్స్, న్యూ బిల్డింగ్ ఫర్ విమెన్ సెంట్రిక్ ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ నీడ్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ కోసం రూ.38.8 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం కోసం రూ.2254 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మొత్తంగా రూ.13,412 కోట్లు మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, బిడ్డల కోసం ఖర్చు పెడుతున్నట్లు వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్