మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం
మంథని
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన లక్ష కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు చేపట్టవచ్చని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 7 లక్షల కోట్ల అప్పు చేసి అతలాకుతలం చేసిందని,
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మంథని ప్రాంతానికి కనీసం సాగునీరైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించాడు.గాలికి కూలిపోయే వంతెనలను, కుంగిపోయే ప్రాజెక్టులను కట్టి బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని,గాలి మోటార్లలో వచ్చి కబుర్లు చెప్పే వారి మాటలు నమ్మకండని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామని,పేద ప్రజల ముఖాల్లో ఆనందం చిరునవ్వులు చూడడానికే కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుందని,రైతుబందు రాకుండా కుట్ర చేస్తున్న బిజేపి ,ఆగస్టు 15 లో రైతులకు రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కులగణన మొదలు పెట్టి సామాజిక న్యాయం చేస్తామన్నారు.