- Advertisement -
మంత్రి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
Ministerial sub-committee meeting was chaired by minister Anita
అమరావతి
అమరావతి సచివాలయంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనితగారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’గా మార్చడంపై చర్చ జరిగింది. టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపింది. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో ఐటీ మంత్రి నారా లోకేశ్ , వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ , స్త్రీ,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గోన్నారు.
- Advertisement -