- Advertisement -
తెలంగాణ గవర్నర్ ను కలిసిన మిస్సెస్ ఇండియా 2024 ముప్పిడి సుష్మ…..
Miss India 2024 Muppidi Sushma met Telangana Governor.....
బాపట్ల:
మిస్సెస్ ఇండియా 2024 ముప్పిడి సుష్మ శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను హైదరాబాద్ రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ తెలంగాణకు చెందిన మహిళ మిస్సెస్ ఇండియా గా ఎన్నిక కావడం తెలంగాణ గర్వపడే విషయమని, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన సుష్మ ను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నింటికీ ఆహ్వానించాలని తన కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగాసుష్మా మాటడుతూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తాను, ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ఆహ్వానించినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు ఆమె తెలిపారు. తాను ఉత్తమ సాంస్కృతిక దుస్తులతో అవార్డు పొందానని గవర్నర్ కి తెలిపినప్పుడు, తెలంగాణ గవర్నర్ చేనేత గురించి ఆరా తీశారని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరిలో పారిస్ లో జరిగే అంతర్జాతీయ మిసెస్ వరల్డ్ పోటీల్లో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. సినీ స్టార్స్ సమంత, ప్రియాంక చోప్రా తన రోల్డ్ మోడల్ గా చెప్పుకునే సుష్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ముప్పిడి వెంకట్ రెడ్డికి కోడలు. సుష్మ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చీరాల. గుంటూరు, విజయవాడ లో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేసి, గుంటూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేశారు. వివాహం అనంతరం తెలంగాణలో స్థిరపడిన ఆమె సాఫ్ట్వేర్ వృత్తిని వదిలి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సుష్మ 2024 మిస్సెస్ ఇండియాగా ఎంపీగా కావటం పట్ల చీరాల ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -