శ్రీశైలంలో విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే బుడ్డా
MLA Buddha collected donations in Srisailam
శ్రీశైలం
విజయవాడ వరద బాధితుల సహాయార్థ కోసం బిక్షాటన చేస్తూ విరాళాలను శ్రీశైలం నియోజవర్గ టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సేకరించారు.విజయవాడలో అకాల వర్షాలకు అక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం
వరద,బురద మయం అయ్యాయని అన్నారు. వారు పడుతున్న కష్టాలు,బాధలను చూసి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఉదయం రాత్రి తేడా లేకుండా స్వయంగా చంద్రబాబే వెళ్లి
ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. విరాళాలు ఇచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గం లో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు
వచ్చి విరాళాలు అందిస్తున్నారని కొండ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు, పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేటందుకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే బుడ్డా.