ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
MLA congratulated the students who secured MBBS seats
రుద్రవరం,
నీట్ లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీట్లు పొందిన ఐదుగురు విద్యార్థులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందించారు. బుధవారం అదే రుద్రవరంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు బిందు ఛాయాదేవి, లోకేష్, పూజిత, శరత్ అనే విద్యార్థులతో పాటు ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అలాగే మరో ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను సమావేశంలో కలిశారు. ఎంబిబిఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థుల తో పాటు మరో ఇద్దరు విద్యార్థులను శాలువాలతో ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. ఎంబిబిఎస్ పూర్తి చేసి విద్య నేర్చుకున్న పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. అలాగే ఆదర్శ పాఠశాలలో కొన్ని వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు దీంతో ఎమ్మెల్యే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ కు హామీ ఇచ్చారు.




