- Advertisement -
రాష్ట్రంలో సుమారు 40 రైల్వే స్టేషన్ లు ఆధునీకరణ-కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి
Modernization of about 40 railway stations in state- Kishan Reddy Union Minister
హైదరాబాద్
2021 నుంచి చర్లపల్లి అభివృద్ది పనులు జరిగాయి. తెలంగాణ కు ఏది కావాలన్నా కేంద్రం సహాయం అందించింది. చర్లపల్లి అభివృద్ది పనులపై నేను దాదాపు ఆరు సార్లు వచ్చి పర్యవేక్షించానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.చాలా రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఘట్ కేసర్ వరకు వెళ్తాయని అన్నారు.
720 కోట్ల రూపాయలతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం. 1300 రైల్వే స్టేషన్ లు దేశ వ్యాప్తంగా అభివృద్ది జరుగుతుంది. తెలంగాణ లో సుమారు 40 స్టేషన్ లు ఆధునీకరణ చేస్తోంది కేంద్రం. రైలు కూత వినిపించని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు వేసి రైళ్ల సౌకర్యం కల్పిస్తుంది. రైళ్ళ ప్రమాదాలకు చెక్ పెట్టేలా కవచ్ తీసుకొచ్చాం. వందే భారత్ రైళ్లు 5 తెలంగాణ కు వచ్చాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోయే రోజుల్లో వస్తె బెంగులూరు కు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం అవుతుంది. లక్ష కోట్లతో జాతీయ రహదారి విస్తరిస్తున్నాం. కాజీపేట లో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం 1000 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అడిగాం. మేము ఎన్నో సార్లు అడిగిన ఇవ్వలేదని అన్నారు.
అయినప్పటికీ మేము ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యాదగిరి గుట్ట వరకు పొడింగించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. లక్షల మంది ప్రయాణీకులు యాదగిరి గుట్టకు వెళ్తారు. కాబట్టి ఎంఎంటీఎస్ రైళ్లు వస్తె సమయం ఆదా అవుతుంది. కొమరవెల్లి స్టేషన్ కూడా కడుతున్నం. చర్లపల్లి రైల్వే స్టేషన్ కు రావాలంటే అప్రోచ్ రోడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. యెన్నో సార్లు కేసిఆర్ లేఖ రాసిన పట్టించు కోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వమైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయండి. ట్రిపుల్ ఆర్ వస్తుందని అన్నారు.
- Advertisement -